అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు. త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి భార్యాభర్తలు. ఆయనకు తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన ఉన్నారు. తన బైక్‌కు మరమ్మతులు చేయించిన మురళి..మెకానిక్ చెప్పినట్టు ఇంజిన్‌ను రాత్రంతా ఆన్‌లోనే ఉంచాడు. ఆ గది ఇరుగ్గా ఉండటం..గాలి బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో..రాత్రి నుంచి బైక్ నుంచి వచ్చిన పొగ అంతా గదిలో వ్యాపించింది. దీంతో తాత, మనవడు, మనవరాళ్లు ఆ పొగ పీల్చి మృతిచెందారు. ఇంటి పైన గదిలో నిద్రించడంతో మురళి, రేవతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అన్నమయ్య జిల్లాలో విషాదం…
120





Total views : 47785