138
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచనా విధానం వల్లే సమస్యలొస్తున్నాయని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీశాఖ అధికారులు ప్రతిదానికీ అడ్డంకులు పెడుతున్నారని, ఏ పనీ ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి తీరుపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి.





Total views : 47703