అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి సమస్యలు, సూచనలు స్వీకరించారు. అండర్ గ్రౌండ్ వాటర్, స్టార్మ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు. గ్రామ కంఠాల బయట ఉన్న మౌలిక సదుపాయాలతో సమానంగా గ్రామాల్లో నిర్మాణం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి చేస్తామన్నారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలో మీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయన్నారు. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు కూడా పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.
109




Total views : 47755