అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజాధాని ప్రాతంలో R-5జోన్‌ని ప్రభుత్వం రద్దు చేసింది.R-5 జోన్ కోసం ఉద్దేశించిన 900 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం రూపొందించన మాస్టర్ ప్లాన్‌లో R-5 అనే ప్రత్యేక జోన్ అసలు లేదు. అయితే వైసీపీ హయాంలో రాజధాని అమరాతిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అమరావతి ప్రాంతంలో R-5జోన్‌ను ప్రవేశపెట్టింది. దీని వల్ల అమరావతి అసలు రూపకల్పన దెబ్బతింది అని …భవిష్యత్‌లో మౌళిక వసతుల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరించారు. దీంతో R-5 జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైసీపీ హయాంలో ఆర్-5 జోన్‌లో ఇండ్ల స్థలాలు కేటాయించడం, ఇందుకోసం సీఆర్డీయేకు చెందిన 900 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విఘాతం ఏర్పడుతుందని సీఆర్డీయే అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.దీంతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో అక్కడ కేటాయించిన భూములను వెనక్కు తీసుకొని వారి ప్రాంతాల్లోనే ప్రభుత్వ విధానం మేరకు అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించాలని స్పష్టం చేశారు. దీనికోసం భూసమీకరణ, భూ సేకరణ విధానాల్లో ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. 2023కు ముందు ఉన్న విధంగానే ఆర్ -5 జోన్ కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.దీంతో అమరావతి రాజధానిలో 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.R-5 జోన్‌లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు భూ పంపిణీని సీఆర్డీఏ రద్దు చేసింది. R-5 జోన్‌తో అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది కలగకుండా R-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.