149
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష అనుభవం కలిగిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ లో పదవీ విరమణ పొందనున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.



Total views : 47746