ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిదేనని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాల్సిన సమయంలో 19 వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. తన తండ్రిని ప్రత్యర్థి పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై స్టే విధించింది. ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మూడు వారాల్లోపు పూర్తి చేయాలని తుది తీర్పును వెలువరించింది.





Total views : 81448