ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. బాంబులు, మిస్సైళ్లతో మూడు దేశాలు హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడీ యుద్దం పశ్చిమాసియా దాటి విస్తరించింది. సైప్రస్‌పై ఇరాన్ మిస్సైళ్లను ప్రయోగించింది. సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ మిస్సైల్ ప్రయోగాన్ని తాజాగా యూకే ధృవీకరించింది. మరోవైపు.. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడాన్ని చైనా, రష్యా ఖండించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాలు, నైతిక విలువలను.. అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఆక్షేపించారు. ఇరాన్‌పై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఇరాన్ అణ్వాయుధాల తయారీని నిలిపివేయాలని జపాన్ సూచించింది. అమెరికా, ఇరాన్‌లు చర్చలు కొనసాగించాలని తెలిపింది. ప్రస్తుత పరిణామాలతో పశ్చిమాసియా గందరగోళంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఈజిప్టు అధ్యక్షుడు అబెల్ ఫతా ఎల్సిసీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం..
93
previous post