Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home International ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

by CVR NEWS
ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది. డ్రగ్స్‌ ముఠా నాయకుడు ఎల్‌ మెంచో సైన్యం కాల్పుల్లో మరణించాడు. దీంతో మాఫియా డాన్ అనుచరులు రెచ్చిపోయి ప్రతీకార దాడులకు దిగటంతో హింస చెలరేగింది. మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు దాడులకు దిగారు. 25 మంది నేషనల్‌ గార్డ్‌ సభ్యులను హత్య చేశారు. 59 ఏళ్ల ఎల్‌ మెంచో హతమయ్యాక పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు వాహనాలను తగలబెట్టారు. రహదారుల్ని దిగ్బంధించారు. సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, బ్యాంకులకు నిప్పంటించారు. వారు జరిపిన ఆరు వేర్వేరు దాడుల్లో 25 మంది నేషనల్‌ గార్డ్‌ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ భారత్‌ సహా పలు దేశాలు మెక్సికోలోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి. తాజా హింసలో కొందరు సాధారణ పౌరులూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎల్‌ మెంచో కరడుగట్టిన నేరగాడు. మెక్సికోలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్రిమినల్‌ సంస్థ ‘న్యూ జనరేషన్‌ కార్టెల్‌’కు అతడే బాస్‌. అమెరికాకు ఫెంటానిల్, మెథాఫెటమైన్, కొకైన్‌లను అక్రమంగా రవాణా చేయిస్తుంటాడు. ఎల్‌ మెంచోను అదుపులోకి తీసుకునే సమాచారమిచ్చేవారికి దాదాపు రూ.136 కోట్ల రివార్డు అందజేస్తామంటూ గతంలో వాషింగ్టన్‌ ప్రకటించింది. అతడి కుమారుడు అమెరికాలో డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.