Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

by CVR NEWS

ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి రానుంది. కుటుంబ సర్వే నివేదిక రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి కేంద్రంగా విడుదలైన ఈ ఆదేశాలు రైతాంగంలో హర్షాన్ని నింపుతున్నాయి. ఈ నెలాఖరులోగా అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం విశేషం. పెండింగ్‌లో ఉన్న 46,113 దరఖాస్తులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.250 కోట్ల వ్యయం చేయనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. పెండింగ్ కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి 10,000 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కేటాయించాలని నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్ సరఫరాలో లో వోల్టేజ్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023980
Total views : 143669

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.