ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని..రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పమన్నారు .5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్న మంత్రి..వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం తన అదృష్టమన్నారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామన్నారు. ఈ బడ్జెట్ రాయలసీమ ప్రజల కలలను నెరవేస్తుందని..యువత ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
122
previous post