191
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ కుమారుడి మృతిపై న్యాయం చేయాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. సింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో తౌషిక్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఐతే తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం, పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలంటూ అసెంబ్లీ దగ్గర ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులును పోలీసులు అరెస్టు చేయటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.





Total views : 47736