Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా?

ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా?

by CVR NEWS

ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా? ఒక కథ ఆ సమాజంలో అనుమానాల అగ్నిని రాజేస్తుందా? అంటే అక్షరాల పాకిస్థాన్‌లో అదే జరుగుతోంది .“దురంధర్” సినిమా రిలీజ్ తర్వాత అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరికి సందేహాలు, మనలో ఎవరైనా ఇండియన్ ఏజెంట్ ఉన్నాడా అనే అనుమానాలతో పాకిస్థానలో ఒక రకమైన మానసిక యుద్ధం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.

దురంధర్ సినిమా.. ఒక గూఢచారి కథగా వచ్చినా పాకిస్థాన్‌లో అది భయానక వాస్తవంగా మారిందని చెబుతున్నారు.ఈ సినిమా చూసిన తర్వాత ఎవరినీ నమ్మలేకపోతున్నామంటూ అక్కడి ప్రముఖులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతాధికారుల వరకు“ఇతను ఇండియన్ ఏజెంట్ అయ్యుంటాడా?” అన్న అనుమానం కలిగిస్తోంది. అక్కడి వారిలో ఈ భయానికి కారణం సినిమాలో చూపించిన గూఢచారి నెట్‌వర్క్.దశాబ్దాలుగా పాకిస్థాన్‌లోనే జీవిస్తూ… భారత ఏజెంట్లుగా పనిచేస్తున్న వ్యక్తుల కథ అక్కడి ప్రజలను షాక్‌కు గురి చేస్తోంది. దీంతో రాజకీయ నేతలు, సైనిక వర్గాల్లో కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోతున్న పరిస్థితి తలెత్తింది. రాజకీయంగానూ ఈ సినిమా పెద్ద దుమారం రేపింది.ప్రతిపక్ష, అధికార పార్టీలు ఒకరినొకరు “ఇండియన్ ఏజెంట్లు” అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు యుద్ధాలకే పరిమితమైన భారత్-పాక్ వైరం ఇప్పుడు “సైకలాజికల్ వార్” స్థాయికి చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆసక్తికర విషయం ఏమిటంటే…ఈ సినిమాను పాకిస్థాన్‌లో అధికారికంగా బ్యాన్ చేసినా వివిధ మార్గాల్లో దాదాపు ప్రతి ఒక్కరూ చూశారు.ఇది కేవలం సినిమా ప్రభావం మాత్రమే కాదు.భారత్ సాధిస్తున్న దౌత్య, వ్యూహాత్మక విజయాలపై పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఒత్తిడి కూడా కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ఇలా దురంధర్ సినిమా పాకిస్థాన్ లో ఇంతటి ప్రభావం చూపిస్తుందటే ఇది ఒక మానసిక యుద్ధం వంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

004888
Total views : 33575

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.