Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News గల్ఫ్‌ దేశాల్లో మరింత పెరిగిన ఉద్రిక్తతలు.

గల్ఫ్‌ దేశాల్లో మరింత పెరిగిన ఉద్రిక్తతలు.

by CVR NEWS

గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. కీలక గ్యాస్‌, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నాయి ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా. తమ నేతలు నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్‌ ఖతీబ్‌ మరణానికి ప్రతీకారంగా..క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్‌. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్‌ సిటీపై బాంబుల వర్షం కురిపించింది ఇరాన్‌. ఈ దాడిలో ఖతార్‌ ఆర్థికవ్యవస్థకు పునాదిగా ఉన్న ఇండస్ట్రియల్‌ సిటీ భారీగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి ఆ దేశ వర్గాలు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సౌదీ అరేబియా కూడా అంతకుముందు 8 బాలిస్టిక్‌ మిసైల్స్‌ను అడ్డుకొన్నట్లు వెల్లడించింది. ‘‘అవసరమైతే సైనిక చర్యను తీసుకొనే హక్కు తమకుందని సౌదీ హెచ్చరికలు జారీ చేసింది.

యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్‌ ఆయిల్‌ ఫీల్డ్‌పై ఇరాన్‌ దాడులు చేసింది. దీంతోపాటు హబ్‌షాన్‌ గ్యాస్‌ కాంప్లెక్స్‌ను కూడా లక్ష్యంగా చేసుకొంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌షోర్‌ గ్యాస్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం. దీంతో యూఏఈ ప్రభుత్వం ఇక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు యూఏఈ సమీపంలో నౌకపై దాడి జరిగింది. యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 20కి పైగా నౌకలు, ట్యాంకర్లపై దాడులు జరిగాయి. పశ్చిమాసియాలో భీకర దాడులతో క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 110 డాలర్లకు చేరింది.

ఖతార్‌ గ్యాస్‌ కేంద్రంపై దాడి విషయంలో ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. అమాయకపు ఖతార్‌పై ఇరాన్‌ తెలివి తక్కువగా దాడి చేసిందని..ఇదే కొనసాగితే ఇజ్రాయెల్‌ సాయం ఉన్నా, లేకపోయినా.. తాము ఇరాన్‌పై మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్‌ గ్యాస్‌ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని..ఖతార్‌ ఎల్‌ఎన్‌జీపై మరోసారి దాడి చేస్తే ఏమాత్రం సహించనని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

023328
Total views : 141765

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.