Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Devotional టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

by CVR NEWS

TTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర. ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర..ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఆయన..స్వామి సన్నిధిలో ప్రమాణస్వీకారం చేసి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవచేసే భాగ్యం దక్కిందన్నారు రవిచంద్ర. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ నేపథ్యంలో..ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించింది ప్రభుత్వం.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.