Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Sports టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు.

టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు.

by CVR NEWS

టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌతాఫ్రికా జట్టు.. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం అయింది. సూపర్-8లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 76 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(0), అభిషేక్ శర్మ(15), తిలక్ వర్మ(1), సూర్యకుమార్(18), సుందర్(11), హార్దిక్ పాండ్యా(18), రింకూ సింగ్(0) పరుగులు చేశారు. శివమ్ దూబే 42 పరుగులతో చివరి వరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 18.5 ఓవర్లు ఆడిన భారత్ 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మైక్రో జాన్సన్ 4, కేవవ్ మహరాజ్ 3, కార్బిన్ 2, మార్కరమ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (63) హాఫ్ సెంచరీ సాధించగా.. డేవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ 44 పరుగులు నాటౌట్ తో దూకుడుగా ఆడేశారు. మార్‌క్రమ్ (4), క్వింటన్ డికాక్ (6), రియాన్ రికెల్టన్ (7) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్ష్‌దీప్‌ 2.. శివమ్‌ దూబె, వరుణ్‌ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు ఇచ్చాడు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.