Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Politics తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

by CVR NEWS

తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది. సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కేవలం 10,000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30,000 మంది పైగా తరలివచ్చారు. విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు . విజయ్ ఇప్పటికే జనవరి 12న తొలి విచారణ, జనవరి 19న రెండో విచారణ జరిగాయి.. రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి. ఈ విచారణలో విజయ్ — “తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు, పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ నేపధ్యం లో ఇవాళ విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది.

Advertisements

You may also like

Our Visitor

014083
Total views : 78929

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.