తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లీగల్ మెట్రోలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్. స్వామికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంచల ప్రదీప్ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీన తాను కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్‌లోని డీమార్ట్ స్టోర్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేశానని తెలిపారు. మొత్తం కొనుగోలు చేసిన సరుకుల బిల్లు దాదాపు రూ.9000 వరకు వచ్చిందని చెప్పారు. అయితే ఇంటికి వెళ్లి బిల్లును పరిశీలించగా ఒక పప్పు పదార్థం కిలో ధర రూ.2899గా తప్పుగా నమోదు చేయబడినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై వెంటనే డీమార్ట్ సిబ్బందిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తానని చెప్పినప్పుడు కూడా కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందిస్తూ వాగ్వాదానికి దిగారని తెలిపారు.
తాను ఎఫ్‌సీఐ మాజీ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎదురైతే సాధారణ పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పెద్ద షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌లో ఇలాంటి పొరపాట్లు జరుగడం వినియోగదారులకు తీవ్ర అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.అందువల్ల వినియోగదారుల హక్కులను పరిరక్షించే దిశగా సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డీమార్ట్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు
130




Total views : 47778