Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News తెలంగాణ సినిమా ప్రియులకు తీపి కబురు.

తెలంగాణ సినిమా ప్రియులకు తీపి కబురు.

by CVR NEWS

తెలంగాణలోని సినిమా ప్రియులకు హైకోర్టు తీపికబురు అందించింది. ఇకపై థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు వసూలుకు ఆస్కారం కలిగించే జీవో నెంబర్ 121ను హైకోర్టు కొట్టేసింది. సాధారణంగా మనం ఏదైనా మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అయితే 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.దీంతో అక్కడ సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ప్రత్యేక పార్కింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఇటీవల దిల్‍సుఖ్‍నగర్‍లోని కోణార్క్ థియేటర్‌లో ఓ ప్రేక్షకుడి నుంచి 20 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. దీనిపై ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ కొంటే పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది. ఈ తీర్పు కేవలం కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని తెలిపింది. కోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ నిబంధనల పరిధిలోకి వచ్చాయి.

Advertisements

You may also like

Our Visitor

004881
Total views : 33543

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.