సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకర ప్రచారం, వ్యక్తిగత దూషణలపై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్‌తో వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో అదుపుతప్పి ప్రవర్తించే వారికి ఈ సంఘటన గట్టి హెచ్చరిక. రేణు దేశాయ్ అందించిన అధికారిక ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నాలజీ సాయంతో అసభ్యకర పోస్టులు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరించారు. ఆ అకౌంట్ల ఆధారంగా నిందితుల ఆచూకీని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఎవరినైనా దూషించవచ్చని భావించే వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
నటి రేణు దేశాయ్కి సోషల్ మీడియా వేధింపులు
94
previous post




Total views : 33588