నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ పూర్తి సహాయ సహకారం అందిస్తామని కేంద్రమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ‘పాలనా’ పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కోరారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు ఐదువేల 500, హెల్పర్లకు 3వేలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని చెప్పారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను మంత్రి అభినందించారు. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు.
నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
112





Total views : 47736