Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

by CVR NEWS

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 20వ తేదీన శాసన సభలో, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు అత్యంత ముఖ్యమైనవని, ఎక్కువ రోజులు జరగడంతో పాటు ఎక్కువ సమయం పాటు జరుగుతాయని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్​లు పేర్కొన్నారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు సాఫీగా జరుగుతాయని వారు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

007271
Total views : 47748

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.