Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home National నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది..

నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది..

by CVR NEWS

నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోల్ ధరలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా – NHAI పెంచింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వార్షిక టోల్ పాస్ ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 3 వేలు ఉన్న ఈ పాస్ ధర ఇప్పుడు 3 వేల 75 రూపాయలకు చేరింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఈ యాన్యువల్ పాస్ సౌకర్యం కేవలం వ్యక్తిగత అవసరాల కోసం వాడే ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఏడాది టోల్ ధరలను సమీక్షించడం సహజమేనని, ఆ ప్రక్రియలో భాగంగానే స్వల్పంగా ధరలు పెంచామని అధికారులు తెలిపారు. హైవేలపై నిత్యం ప్రయాణించే వారికి ప్రతీసారి టోల్ దగ్గర ఆగి డబ్బులు చెల్లించే ఇబ్బంది లేకుండా ఈ పాస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ కొత్త రేట్ల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించాలని టోల్ ప్లాజా నిర్వహణ సంస్థలకు NHAI ఆదేశించింది.

Advertisements

You may also like

Our Visitor

007288
Total views : 47779

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.