Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home National పీఎం కిసాన్ నిధుల ఫైల్ పై తొలి సంతకం..

పీఎం కిసాన్ నిధుల ఫైల్ పై తొలి సంతకం..

by Prakash
modi

కేంద్రంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ.. రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చారు. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం పెట్టారు. ముచ్చటగా మూడోసారి పీఎంవోలో అడుగుపెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇరువైపులా నిల్చుని సంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మోదీకి స్వాగతం చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. తన సీటులో కూర్చున్న ప్రధాని మోదీ.. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్ పై సంతకం పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమయ్యాయి.


Follow us on : FacebookInstagramYouTube & Google News

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.