97
పెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. రామగుండం మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ అభ్యర్థిపై అధిష్టానం అభిప్రాయాలు సేకరించింది. సీనియర్ కాంగ్రెస్ నేత మహంకాళి స్వామి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి చైర్మన్ గా నూగిళ్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణా రావు ఖరారు చేశారు. ఇంక మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.