Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

by CVR NEWS

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలోని సిల్చార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. యుద్ధం నేపథ్యంలో దేశ పౌరులపై ప్రభావం పడకుండా ఉండేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్‌ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని భావించినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో అది మరోసారి విఫలమైందన్నారు. దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న మోదీ… ఇలా భయాలు సృష్టించి.. తనను వేధించాలని చూస్తున్నారని మోదీ విమర్శలు చేశారు. భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్‌ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. మీరు కాంగ్రెస్‌ను ఇక్కడి నుంచి ఎప్పుడో తరిమికొట్టారని మోదీ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

007295
Total views : 47795

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.