అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త గ్లోబల్ టారిఫ్ విధానంపై వైట్ హౌస్ కీలక వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత వస్తువులపై ప్రస్తుతం ఉన్న 18 శాతం సుంకాన్ని తాత్కాలికంగా 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన ఏకపక్ష సుంకాలను కొట్టివేయడంతో, పాత పద్ధతిలో పన్నులు వసూలు చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, ఇది భారత్‌కు లభించిన శాశ్వత ఊరట కాదని, త్వరలోనే మరిన్ని కఠిన చట్టాలను ప్రయోగించి ఈ సుంకాలను పెంచే అవకాశం ఉందని శ్వేతసౌధం స్పష్టం చేసింది. గతంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పన్నును 25 నుంచి 18 శాతానికి తగ్గించారు. కానీ, ఆ పన్ను విధింపుకు వాడిన చట్టం చెల్లదని కోర్టు తీర్పునివ్వడంతో, ట్రంప్ సర్కారు ఇప్పుడు సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం పన్నును అమలు చేస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. “భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు లేదని…. వారు పన్నులు చెల్లించాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే, ఈ 10 శాతం పన్ను కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్తులో సెక్షన్ 232 లేదా 301 వంటి మరింత శక్తిమంతమైన చట్టాలను ఉపయోగించి, ఈ పన్నులను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను అనుకుంటే పన్నులు ఇంకా పెరగవచ్చునని తెలిపారు. తమ వద్ద పాత చట్టాల కంటే శక్తిమంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు ప్రస్తుతానికి పన్ను భారం తగ్గినా, రాబోయే రోజుల్లో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.
భారత్ కు ట్రంప్ టారిఫ్ ట్విస్ట్..
239
previous post





Total views : 46199