119
అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందనే భయాలతో దలాల్ స్ట్రీట్ రక్తసిక్తంగా మారింది. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ క్లోజింగ్ నాటికి 1237 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో 1450 పాయింట్లకు పైగా పడిపోయిన సూచీ చివరి నిమిషం కొంత తేరుకుని 1 శాతానికి పైగా నష్టాల్లోనే క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ కూడా 365 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 955 పాయింట్లు పడిపోయాయి. ఇవాళ ఒక్కరోజునే మదుపర్ల సంపాదన దాదాపు 8 లక్షల కోట్లు ఆవిరయింది. అమెరికా మిలిటరీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని.. ఈవారమే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.




Total views : 46172