Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Sports ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..

by CVR NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించారు. గ్రూప్ దశలో భాగంగా జరిగిన ఒక కీలక మ్యాచ్‌లో, టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మ నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో తిలక్ వర్మకు కాంగ్రెస్ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

004888
Total views : 33579

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.