Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు

by CVR NEWS

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో తమకు ఓటేయలేదంటూ ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ఆమె భర్త ఓటర్ల ఇంటి వద్దకు డిమాండ్‌ చేశారు. తమకు నిజంగా ఓటేశారా.. గుడికి వచ్చి నిరూపించుకోవాలనడంతో ఓటర్లు ఆయనపై మండిపడ్డారు. డబ్బులు ఎవరు ఇవ్వమన్నారంటూ తిరగబడ్డారు. మేము మీకు ఓటు వేయలేదని ఎలా నిరూపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సదరు అభ్యర్థి భర్త గతంలో ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. డబ్బులు అడుగుతున్న వీడియో సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: