146
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, కస్టమర్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న ఒక బ్రాంచ్ మేనేజర్ ఉదంతం మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చింది. ముత్తూట్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని మోసాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు తన వద్ద ఉన్న అధికారంతో తాకట్టులో ఉన్న బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తానని కస్టమర్లను నమ్మించేవాడు. అలా పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి 4 లక్షల రూపాయల నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.





Total views : 33597