Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.

by CVR NEWS

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో..ఈగల్ టీమ్, ఎస్‌‌వోటీ, స్థానిక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు.. ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ శర్మ ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీ రితేష్ రెడ్డికి చెందినదిగా ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నమీద్ శర్మ, రితేష్ రెడ్డి, రమేశ్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డితో పాటు ఓ మహిళ ఉన్నారు. వీరంతా వీకెండ్ పార్టీ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలంలోనే డ్రగ్ టెస్ట్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా.. రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్‌గా తేలింది. తామంతా వారం క్రితమే సిమ్లా, గోవా పర్యటనల నుంచి వచ్చామని, అక్కడే డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం వీరి రక్త నమూనాలను సేకరించి FSL ల్యాబ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు. సోదాల సమయంలో 2 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

007275
Total views : 47758

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.