Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు..

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు..

by CVR NEWS
2024లో సీఎం అయిన వెంటనే టీటీడీ ప్రక్షాళనపై దృష్టి పెట్టాం

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.. 2047 నాటికి విశాఖ రీజియన్‌లో 800 బిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేశామని, ఐటీ, జీసీసీ, డేటా సెంటర్ హబ్‌గా విశాఖపట్నం, క్వాంటం సిటీగా అమరావతి, రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్ హార్టికల్చర్ ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ప్రతి ప్రాంతానికి ఉన్న భౌగోళిక అనుకూలతల ఆధారంగా ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామన్నారు.భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమాంతర అభివృద్ధి జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46151

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.