ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటరీ ద్వారా ఆస్తుల పంపిణీ వివరాలను వెల్లడించిన ఆమె… షర్మిలను సమర్థిస్తూ, జగన్‌పై విమర్శలు చేశారు. వైఎస్ చనిపోయే నాటికి ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని, పంపకాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆస్తులు నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, కోడలికి అన్యాయం చేశాడని అన్నారు. ఎప్పటికైనా ఈ విషయంలో న్యాయం చేస్తాడని తల్లిగా భావిస్తున్నానని విజయమ్మ తెలిపారు. అలాగే MOU లో షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి ఆమెకు చెందాల్సిందేనని.. అందుకే జగన్ కూడా దీన్ని రాశాడని చెప్పారు. అంతేకాదు నిజానికి ఆమెకు తక్కువే రాశాడని… సరస్వతి సిమెంట్‌తో సహా MOU లో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని విజయమ్మ స్పష్టం చేశారు. అలాగే జగన్ ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే అన్నారు. ఆస్తుల పంపకం జరగలేదని మరోసారి స్పష్టం చేసిన విజయమ్మ… నిజం ఏంటో దేవుడికి, తన కొడుక్కి తెలుసని నోటరీ ద్వారా వెల్లడించారు.
వైఎస్ జగన్‌పై మరోసారి తల్లి విజయమ్మ షాకింగ్ కామెంట్స్..
277
previous post



Total views : 141768