134
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి టి. బాపిరెడ్డి దంపతులు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సినీ సంగీత దర్శకుడు కోటి, కోలా ఆనంద్ దంపతులు దేవస్థానానికి విచ్చేసి లింగోద్భవ దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు స్థానిక భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.