Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Devotional శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

by CVR NEWS

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక  పూజ కార్యక్రమాలు నిర్వహించిన  అనంతరం రథాన్ని కదిలించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రథాన్ని లాగారు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి  లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇసుకవేస్తే రాలనంత భక్తులతో గోవింద నామస్కరణాలతో కదిరి పట్టణం మారుమోగింది. శ్రీవారికి దవనం, మిరియాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. దాతలు భక్తులకు ఉచిత అన్నదానం, త్రాగునీరు ఏర్పాటుచేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షించారు.

Advertisements

You may also like

Our Visitor

004887
Total views : 33564

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.