రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను మెజర్‌మెంట్ పుస్తకాలలో నమోదు చేసి ఉంటే, ఆ బిల్లులను చెల్లించవచ్చని తెలిపింది. గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో సర్పంచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వారికి ఊరట కలిగించింది. ఈ నిర్ణయంతో పంచాయతీల్లో నిలిచిపోయిన చెల్లింపులకు మార్గం సుగమం అయ్యింది.
సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
220
previous post




Total views : 46165