Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News హైదరాబాద్ బిర్యానీకే కాదు, తెలుగు సినిమాకు స్పెష‌లే.

హైదరాబాద్ బిర్యానీకే కాదు, తెలుగు సినిమాకు స్పెష‌లే.

by CVR NEWS

హైదరాబాద్ బిర్యానీకే కాదు, దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గద్దర్‌ అవార్డ్స్ ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ‌లో సినీ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావించినట్లు వివ‌రించారు. సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వ్యవహరించార‌ని గుర్తు చేశారు. సినీ కార్మిక పక్షపాతిగా నటుడు ప్రభాకర్ రెడ్డి గొప్ప పనులు చేసినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సౌత్ కొరియాలో తరహాలో సినిమాను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ సినిమా హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని వివరించారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఏఎన్నార్ అలాగే ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ త‌ర్వాత తెలుగు చిత్ర ప‌రిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదిగింద‌న్నారు. సినిమా ఇండ‌స్ట్రీకి ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా, త‌మ స‌ర్కార్ ఆదుకుంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. ఆప‌రేష‌న్ సిందూర్ జ‌రిగిన‌ప్పుడు కూడా హైద‌రాబాద్ లో మిస్ ఇండియా లాంటి పోటీలు నిర్వహించామ‌ని గుర్తు చేశారు. అందుకే ప్రపంచంలోనే హైద‌రాబాద్, సేఫ్‌ సిటీ అని వెల్లడించారు. ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టేవారికి త‌మ స‌ర్కార్ అండ‌గా ఉంటుంద‌న్నారు.

Advertisements

You may also like

Our Visitor

004888
Total views : 33573

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.