హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో ఆరు కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను 32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌సిటీకి కూడా మెట్రోను తీసుకెళ్లనున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీవరకు 40 కిలోమీటర్ల కారిడార్‌గా 8 వేల కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే నాగోల్-ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌కు సంబంధించి డీపీఆర్‌లో స్వల్పమార్పులు చేశారు. మొదట ప్రతిపాదించిన నాగోలు, ఎల్బీనగర్ వయా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు- మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు-శంషాబాద్ ఎయిర్‌పోర్టు 29 కిలోమీటర్లకు బదులుగా నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆరాంఘర్, న్యూహైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎయిర్‌పోర్టుకు కారిడార్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇటీవల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీపీఆర్ అంశాలను తెలియజేశారు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి