Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Telangana హైదరాబాద్‌ శివారు ఘట్కేసర్‌లో మైనింగ్‌ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది.

హైదరాబాద్‌ శివారు ఘట్కేసర్‌లో మైనింగ్‌ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది.

by CVR NEWS

హైదరాబాద్‌ శివారు ఘట్కేసర్‌లో మైనింగ్‌ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. బూబకాసురులు ఏకంగా మైసమ్మగుట్టను పిండి చేస్తున్నారు. 130 ఎకరాల వెంచర్లో 27 ఎకరాలకు బ్లాస్టింగ్ పర్మిషన్ తీసుకొని పగలు రాత్రీ తేడాలేకుండా పేళుల్లకు పాల్పడుతున్నారు.బ్లాస్టింగ్ లతో ఇబ్బందులు పడుతున్నారు మైసమ్మ గుట్ట కాలనీవాసులు. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మార్వో, పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు…అయితే ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వెంచర్‌లో 20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు కూడా తెలుస్తోంది..వెంచర్ కు అనుమతి తీసుకొని ప్రభుత్వ భూముల్లో సైతం బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారనే ఆరోపిస్తున్నారు. బడా బాబుల అండదండలతో అధికారులను చెలరేగిపోతున్నారనీ..ఈ విషయమై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానికులు సీవీఆర్ న్యూస్ ను ఆశ్రయించడంతో
పరిశీలనకు వెళ్లింది..వెంచర్ లోపలికి వెళ్లకుండా సీవీఆర్‌ న్యూస్‌ను సిబ్బంది అడ్డుకోవడంతో మరింత దూమారం రేపుతోంది. మైనింగ్ మాఫియా తెరవెనుక ఇంకెన్ని అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారనే చర్చ సాగుతోంది. అంతేకాదు..మైనింగ్ మాఫియా వెనుక ఉన్న బడాబాబుల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తుతున్నాయి..

Advertisements

You may also like

Our Visitor

007259
Total views : 47728

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.