Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి..

by CVR NEWS

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కీలక కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రసూతి సేవల కోసం వచ్చే మహిళలకు అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ట్రామా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు కూడా సక్రమంగా ఉపయోగించడంలేదని ఆరోపిస్తున్నారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులను తరలించడానికి అవసరమైన వీల్‌చైర్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాత్రి సమయంలో దోమల సమస్య అధికంగా ఉండటం, విద్యుత్ సరఫరాలో లోపాలు, జనరేటర్ సదుపాయాల లోపం పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తున్నాయి. అంతేకాకుండా, అవసరమైన సిబ్బంది లేకపోవడం వల్ల సేవలు సరిగా అందడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని సౌకర్యాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే, అచ్చంపేట నియోజకవర్గంలోని దూరప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చంపేటలోని దవాఖానలో పరిస్థితులపై అక్కడ ఉన్న డాక్టర్లు స్పందించారు .సమస్యలు ఉన్నమాట వాస్తవమే అని ఒప్పుకుంటూ పరిష్కారానికి కృషిచేస్తున్నామని చెబుతున్నారు .
ఇక నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు రోగులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చే ప్రజలకు సరైన చికిత్స అందకపోవడంతో, వారిని నాగర్ కర్నూల్ లేదా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రులకు పంపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేకపోవడం, అవసరమైన వైద్య సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన మాతా-శిశు రక్షక కేంద్రం కూడా అధ్వాన స్థితిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణీ లకు వారానికి ఒక్కరోజే డెలివరీ సేవలు అందిస్తున్నారని, నీటి వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని బాధితులు చెబుతున్నారు.డయాలసిస్ రోగులకు అవసరమైన యంత్రాలకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడం, చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్టులు, ఓపీ డాక్టర్లు లేకపోవడం వంటి సమస్యలు ఆసుపత్రి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రిని ఇలా నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014995
Total views : 81448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.