కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరంలో అక్రమంగా చొరబడిన చెన్నైకు చెందిన మరో బోటును అధికారులు పట్టుకోవడం కలకలం రేపుతోంది. మెరైన్, మత్స్యశాఖ, ఫారెస్ట్ శాఖల సంయుక్త గస్తీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఈ బోటును ఆపి తనిఖీ చేయగా, సరైన అనుమతులు లేకుండా తీరప్రాంతంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వెంటనే బోటును అదుపులోకి తీసుకుని జువ్వెలదిన్నెకు తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించి, అక్రమ రవాణా లేదా ఇతర నేర కార్యకలాపాల కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదా అన్న అంశంపైనా దృష్టి సారించారు. యథేచ్ఛగా బొట్లు ఏపీ తీరానికి రావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది .దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి .
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు తీరంలో అక్రమంగా ప్రవేశించిన చెన్నై బోటు పట్టుబడిన ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. సముద్ర భద్రతను కట్టుదిట్టం చేస్తూ గస్తీ నిర్వహిస్తున్న మెరైన్, మత్స్యశాఖ, ఫారెస్ట్ అధికారులు ఈ బోటును గుర్తించి తనిఖీ చేయగా అనుమతులు లేకుండా ప్రవేశించిన విషయం బయటపడింది. దీంతో అధికారులు బోటును స్వాధీనం చేసుకుని జువ్వెలదిన్నెకు తరలించారు. ఇటీవల బోట్ల అక్రమ ప్రవేశం యథేచ్ఛగా జరుగుతుంది .ఇప్పటికే మూడు బొట్లు అక్రమంగా ప్రవేశిస్తే అధికారులు పట్టుకున్నారు .అయినా తాజగా మరో బోటు పట్టు బడడం సంచలనంగా మారింది .మరో వైపు పట్టుబడ్డ బొట్లు గల్లంతు అవ్వడం పై రాజకీయ రచ్చ జరుగుతుంది .ఈ మొత్తం వ్యవహారం పై లోతైన విచారణ జరపాలని మత్స్య కారులు కోరుతున్నారు . ఈ విషయంపై సీవీఆర్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది .ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది .




Total views : 47764