Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Telangana 6 అబద్ధాలు.. 66 మోసాలు

6 అబద్ధాలు.. 66 మోసాలు

by Rama
6 అబద్ధాలు.. 66 మోసాలు

రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్‌లకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విడుదల చేస్తారు. చార్జిషీట్‌ను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేసి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు 92400 15247 నంబర్‌కు కాల్ చేయాలని బీజేపీ నేతలు కోరారు.

ఈరోజు చార్జిషీట్ విడుదల, 2, 3 తేదీల్లో అసెంబ్లీల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు, కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేస్తారు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కనీసం రెండు వేల మంది సభ్యులతో సభ నిర్వహించనున్నారు. ఈ సభలకు రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి తీసుకు రానున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.