హైదరాబాద్ నగరంలో భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ నుంచి పాలకొల్లుకు వెళ్తున్న ‘శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్’కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు, కెపిహెచ్‌బి పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్ క్యాబిన్ నుండి పొగలు వచ్చాయి. మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యి, బస్సును పక్కకు ఆపి, అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మంటలు వేగంగా విస్తరించి, బస్సును పూర్తిగా మింగేశాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులను వేరే మార్గాల్లోకి మళ్లించడం ద్వారా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. బస్సు కాలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఏసీ యూనిట్‌లో సాంకేతిక సమస్యల వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్స్ బస్సును పరిశీలించాక అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.
కేపీహెచ్ బీ లో తగలబడిన దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు..
170
previous post





Total views : 81449