రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు రష్యా భూభాగంలోకి చొరబడింది. దాదాపు వెయ్యి మందికిపైగా ప్రత్యేక బలగాలతో కూడిన ఉక్రెయిన్ సైనిక యూనిట్… రష్యా సరిహద్దులు దాటి 30 కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకు వెళ్లింది. ఈశాన్య ఉక్రెయిన్లోని సుమీ ఒబ్లాస్ట్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ సైనిక యూనిట్.. రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం పరిధిలోని స్వెర్ ద్లికోవో, సుద్జా, మలయా, ల్యుంబీ మోవ్కా నగరాలలో ఉక్రెయిన్ ఆర్మీ పాగా వేసింది. ఈ విషయాన్ని రష్యా ఆర్మీ కూడా ధ్రువీకరించింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపు. ఉక్రెయిన్ ఆర్మీ చర్యలపై స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఘాటుగా స్పందించారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో పెద్దఎత్తున యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, సైనిక ట్రక్కులతో ఆయా నగరాలను రష్యా ఆర్మీ చుట్టుముట్టింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్ రచ్చప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
- జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదంజమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 46162