Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News ఢిల్లీ మాల్వీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.

ఢిల్లీ మాల్వీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.

by CVR NEWS
ఢిల్లీ మాల్వీయనగర్లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 35 మందిని కాపాడారు. మాలవీయనగర్‌లోని లెమన్ గ్రీన్‌ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్‌ సర్క్యూటే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం రూ.50 వేలు అందజేస్తామన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023338
Total views : 141780

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.