158
కొండపల్లి చార్మినార్ రేకుల కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. లారీ రివర్స్ చేస్తున్న సమయంలో గోడకు తగలడంతో, అది కూలి సరిపల్లి శ్రీహరి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీహరి జి కొండూరు మండలం ముత్యాలంపాడుకు చెందిన వ్యక్తి . ఏడాది క్రితమే వివాహమైన శ్రీహరి మరణంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ మృతుడి బంధువులు, గ్రామస్తులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కంపెనీ దాచిపెట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.




Total views : 202968