Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home National మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

by Satya
మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్ సోకిన రోగిని ఇప్పటి వరకు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. భారత్‌లో ఎంపాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, దద్దుర్లుతో బాధపడుతున్న వారిని, ఎంపాక్స్ రోగులతో సన్నిహితంగా మెలిగే వారికి పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ పేర్కొంది. ఎంపాక్స్ లక్షణాలున్న వారికి స్క్రీనింగ్, ఐసోలేషన్, చికిత్సపై మార్గదర్శకాలు జారీ చేసింది.

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, శోషరస గ్రంథుల వాపు, చలి, అలసట వంటివి ఉండటం కూడా ఎంపాక్స్ లక్షణాలు కావొచ్చు. అనుమానిత రోగులకు ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేయాలి. రోగులను సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి తరలించే వరకు ఐసోలేషన్ ప్రాంతాల్లో ఉంచాలి. రోగులను ఎయిమ్స్ సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేస్తుంది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను కేటాయించారు. అనుమానిత రోగిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించడానికి ఎమర్జెన్సీ స్టాఫ్… అంబులెన్స్ కోఆర్డినేటర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.
    సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు. పంటను కేవలం పండించడమే కాదు… దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే…
  • నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
    నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు,…
  • ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
    జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
  • సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.
    ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం…
  • భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.
    భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్‌తో ప్రధాని మోదీని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

024297
Total views : 144639

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.