176
వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు చేశారు నగరంపాలెం పోలీసులు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించడమే కాకుండా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఇక ఇప్పటికే సత్తెనపల్లి లక్కీడ్రా ఉదంతం, చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుల్లో అంబటి రాంబాబు 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉండి, బెయిల్‌పై విడుదలయ్యారు. బయటకు వచ్చిన కొన్ని రోజులకే నిరసన దీక్ష పేరిట నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై మళ్లీ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.





Total views : 81434