ఈరోజు దేశవ్యాప్త డిమాండ్స్ డేలో భాగంగా సిఐటియూ ఆధ్వర్యంలో మంథనిలో కార్మికులు ర్యాలీ నిర్వహించి. అనంతరం ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్పిందని బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తూ కార్మిక వర్గాన్ని పెద్దయెత్తున లూటి చేసిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేకత విధానాల పై పోరాడుదాంబొగ్గు గనులను వేలానికి పెట్టి బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పి తెలంగాణకు సిరుల సంపదైన సింగరేణిని చంపే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.బొగ్గు గనులను సింగరేనికె కేటాయించాలని నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినప్పటికీ కార్మికుల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనియం అని అన్నారు.6 గ్యారెంటీలను అమలు చేస్తూ 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాల జీవోలను సవరించి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.*ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్,సీఐటీయూ నాయకులు బావు రవి,చిప్పకూర్తి చందు,ఎడ్లపల్లి రాజయ్య,అజయ్య,అనిల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని…
- నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేసీఆర్గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.…
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై హైకోర్టు విచారణ..బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 500 కోట్లు విలువైన భూమిని 5…
- ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ షాపులుట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త పేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద ఫుట్ పాత్ ఆక్రమణలకు గురైయ్యాయి.…
- మధ్యాహ్న భోజనం పథకం అంటేనే … పురుగులు అన్నం, నీళ్ల సాంబార్శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి