గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది. మహిళా హాస్టల్లో ఆహారం నాసిరకంగా ఉండడమే కాకుండా వారం రోజుల క్రితం భోజనంలో కాళ్లజెర్రి వచ్చిందని విద్యార్థినిలు ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం భోజనంలో కప్ప వచ్చిందని.. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు వరసగా అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి వారు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ ఆందోళన కొనసాగించారు. విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. విచారణ నివేదికను వెంటనే ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తుఫాను భయంతో వణికి పోతున్న కాకినాడ ప్రజలుకాకినాడ జిల్లా ప్రజలు తుఫాను భయంతో వణికి పోతున్నారు. రాష్ట్రానికి పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదని అధికారులు చెప్పినప్పటికీ తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉప్పడ సముద్రం వద్ద కెరటాలు…
- పురుగుల అన్నం … భోజనం లో కప్పలుగుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది. మహిళా హాస్టల్లో ఆహారం…
- అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్ధి మృతిఅమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ గత మూడు నెలల కిందట ఉన్నత చదువుల కోసం…
- నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్తిరుమల శ్రీవారిని దర్శించుకునే రాజకీయ నాయకుల్లో పలువురు కొండపైన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేస్తుండటం అందరికీ తెలిసింది. కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలో రాజకీయ…
- సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులుఅర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి